ఉద్యోగాలు చేస్తూనే ఓయూ నుంచి పరిశోధన
రఘునాథపాలెం: ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి దంపతులు డాక్టర్ బి.సృజన్‌లాల్, డాక్టర్ జి.మోనికాజాదవ్ డాక్టరేట్లు అందుకుని ప్రత్యేకత చాటారు. వీరిద్దరూ మేనేజ్‌మెంట్ విభాగంలో పరిశోధన పూర్తిచేయడం మరో విశేషం. ప్రస్తుతం సృజన్‌లాల్ ఎస్‌బీఐలో, మోనిక ఎస్పీడీసీఎల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూనే ఉన్నత విద్యపై ఆసక్తితో పీహెచ్‌డీ పూర్తి చేసిన వీరిద్దరు డాక్టరేట్ అందుకున్నారు. సృజన్‌లాల్ తల్లిదండ్రులు బి.సుందర్‌లాల్, శైలజ ఓయూ పూర్వ విద్యార్థులు కావడంతో అదే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు.


