మణుగూరు రూరల్: అండర్–19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు మణుగూరుకు చెందిన గుండెల నేహా ఎంపికై ంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన హెచ్‌సీఏ అండర్–19 ఎంపికల్లో ప్రతిభ కనబరిచి అవకాశం దక్కించుకుంది. మణుగూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా పని చేస్తున్న గుండెల కల్యాణ్ కుమార్తె నేహా చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. ఖమ్మంలో శిక్షణ పొందుతూ ఆటతీరును మెరుగుపరుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
కరాటేలో చిన్నారి ప్రతిభ
పాల్వంచరూరల్: మండల పరిధి లక్ష్మీదేవిపల్లిలో నివాసం ఉంటున్న రాజేష్ భవాని దంపతుల కుమారుడు రిస్వా న్ శింబా కరాటేలో ప్రతిభ చూపుతున్నాడు. ఈ నెల 5,6వ తేదీల్లో హైదరాబాద్‌లోని గౌచ్చి బౌలి స్టేడియంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీల్లో పాల్గొన బంగారు పతకం గెలుచుకున్నాడు. రెజీనా కాన్వెంట్‌లో ఫస్ట్‌క్లాస్ చదువుతున్న శింబాను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
పుష్కరాల పనులు
వేగవంతం చేయాలి
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): గోదావరి పుష్కరాల సందర్భంగా టైర్–1లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని దేవా దాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లను ఆదేశించారు. ఆమె సోమవారం కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలకే పరిమితం కాకుండా పనులను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేస్తామని అన్నారు.
రోడ్డుప్రమాదంలో
యువకుడు మృతి
వివాహం జరిగి ఆరు నెలలకే
మృత్యుఒడికి..
పెనుబల్లి: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు... నూరేళ్లు కలిసుందామని ప్రమాణం చేసి భవిష్యత్‌పై కలలతో పెళ్లి చేసుకుని జీవితం మొదలుపెట్టారు. త్వరలోనే బిడ్డ పుట్టనుందనే సంతోషంలో ఉండగానే విధి ఆ జంటను ప్రమాదంలో రూపంలో విడదీసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కడారి రాకేష్(25) మృతి చెందాడు. ఆయన బైక్‌పై ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరు వెళ్తుండగా కంటైనర్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకోగా, ఇటీవల రాకేష్ భార్య గర్భం దాల్చింది. ఇంతలోనే ప్రమాదం జరగగా, పెనుబల్లి ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయన మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆర్థిక ఇబ్బందులతో
రైతు ఆత్మహత్య
రఘునాథపాలెం: ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని ఈర్లపూడికి చెందిన రైతు చల్లా గోవర్దన్ (55) నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స ఖర్చులతో పాటు వ్యవసాయ పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన పురుగుల మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై గోవర్దన్ కుమారుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉసా్‌మ్‌న్ షరీఫ్ తెలిపారు.
గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం నెహ్రూనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో సోమవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. జహీరపుర ప్రాంతానికి చెందిన గోళ్ల శరత్ వద్ద రూ.19వేల విలువైన 380 గ్రాముల గంజాయి లభించడంతో అరస్ట్ చేశారు.
భార్యపై కత్తితో దాడి
టేకులపల్లి: ఓ వ్యక్తి తన భార్యపై కత్తి దాడి చేయగా, తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని రోళ్లపాడు పంచాయతీ రుక్మాతండా గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో భర్త కోపోద్రిక్తుడై కత్తితో దాడి చేయగా భార్య దస్లీకి తీవ్రగాయాలయ్యా యి. చికిత్స నిమిత్తం ఆమెను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


