అర్హులకు ఓటు హక్కు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు ఓటు హక్కు కల్పించాలి

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఎస్‌ఐఆర్‌ రోల్‌ అబ్జర్వర్‌ ఏ. శ్రీ దేవసేన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ అంకిత్‌తో కలిసి ఎన్నికల నమో దు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికా రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ ఆ హక్కు లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బీఎల్‌ఓ నోటీస్‌ అందజేసినట్లు రసీదును యాప్‌లో నమోదు చేయాలన్నారు. తుది జాబితాను అక్టోబర్‌ 19న ప్రచురిస్తామని తెలిపారు. ఓటర్లకు సందేహా లుంటే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని చెప్పారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,63,413 మంది సాధారణ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 2,40,438 మంది ఓటర్లకు నోటీసులు జారీచేయాల్సి ఉండగా, సోమవారం 7న మధ్యాహ్నం 12 గంటల వరకు 2,40,435 మందికి నోటీసులు సిద్ధం చేశామని వివరించారు. 1,42,392 నోటీసులను ఓటర్లకు అందజేయగా, ఇంకా 98,043 నోటీసులు అందజేయాల్సి ఉన్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట్రావు, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ రోల్‌ అబ్జర్వర్‌ శ్రీ దేవసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement