కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇక్కట్లు
బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
రవిచంద్ర
జూలూరుపాడు: కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లలో ప్రతీ పల్లెకు కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు అందిస్తే, కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవి చంద్ర అన్నా రు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ‘పల్లెలు విధ్వంసం–పడకేసిన పారిశుద్ధ్యం’పై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరంఆర్యవైశ్య కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు అందక, కరెంటు కోతలతో రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి పువ్వా డ అజయ్ కుమార్ హెచ్చరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పోలీసులు హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరా వు మాట్లాడుతూ కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మా రిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేడాక్టర్ బానో త్ చంద్రావతి, బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, లకావత్ గిరిబాబు, కూరాకుల నాగభూషణం, బానోత్ మనీషా లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు భూక్యా కళావతి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సీహెచ్. రామ్మూర్తి, నాయకులు పాల్గొన్నారు.


