అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌ఫెడ్ ఆస్తులు కాపాడాలని అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పాం గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు తుంబూరు ఉమా మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని నారంవారిగూడెం వద్దనున ఆయిల్‌ఫెడ్ డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదారాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ స్థలా న్ని ఆయిల్‌పాం రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దని కోరారు. అనంతరం డీఓ శంకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, ఊగంటి రవి, సీసం రాము, కారం శ్రీరాములు, చక్రధర్ రెడ్డి, దుర్గారావు, గడ్డం సత్యనారాయణ, చిరంజీవి పాల్గొన్నారు.


