కరువుఛాయలు | - | Sakshi
Sakshi News home page

కరువుఛాయలు

Sep 6 2026 12:25 AM | Updated on Sep 6 2026 12:25 AM

● ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర కురవని వర్షాలు ● జిల్లాలో ఇంకా నిండని ప్రాజెక్టులు, చెరువులు ● సీజన్‌ ప్రారంభం నుంచి 17 మండలాల్లో లోటు వర్షపాతమే

మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మి.మీలలో)

అలుముకుంటున్న
● ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర కురవని వర్షాలు ● జిల్లాలో ఇంకా నిండని ప్రాజెక్టులు, చెరువులు ● సీజన్‌ ప్రారంభం నుంచి 17 మండలాల్లో లోటు వర్షపాతమే

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/పాల్వంచరూరల్‌: వానాకాలం సీజన్‌ మొదలై మూడు నెలలు గడిచినా ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేరకు వానలు కురవలేదు. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్ట్‌లు పూర్తిస్థాయిలో నిండకపోవంతో సాగుకు ప్రతికూలంగా మారింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా వరి సాగుకు అనుకూలంగా లేవు. జూన్‌, జూలై నెలల్లో వానలు లేకపోవడంతో రైతులు ఆగస్టుపై ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టులో కూడా అదే పరిస్థితి నెలకొనగా రైతుల ఆశల ఆవిరయ్యాయి. వాగులు, బోర్ల కింద నాట్లు వేసిన రైతులు కూడా వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. నీళ్లు లేక మెట్టపంటలు కూడా వాడిపోతున్నాయి. వెరసి జిల్లాలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి.

లోటు వర్షపాతం

జిల్లాలో సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటిరవకు లోటు వర్షపాతమే నమోదైంది. కేవలం ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 16 మండలాల్లో లోటు, ఒక మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, కొత్తగూడెం మండలాల్లో వర్షపాతం సాధారణానికే పరిమితమైంది. కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూ రు, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, అశ్వారావుపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దమ్మపేట మండలంలో అతి తక్కువ వర్షం కురిసింది.

ప్రతి నెలా తక్కువే

జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 18,376.9 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 12,361.7 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. జిల్లా సరాసరి వర్షపాతం 799 మి.మీ కాగా 537.5 మి.మీ వర్షపాతమే నమోదైంది. జూన్‌మాసంలో 168.9మి.మీ వర్షానికి 161.7 మి.మీ, జూలైలో 312.7మి.మీ వర్షానికి 213.3 మి.మీ, ఆగస్టులో 295.4 మి.మీ వర్షానికి 160.9 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈనెలలో ఇప్పటివరకు 22 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 1.5 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం.

పడిపోతున్న భూగర్భ జలాలు

వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం కూడా పడిపోతోంది. ఆగస్టులో జిల్లాలో భూగర్భ జలమట్టం 8.26 మీటర్లుగా నమోదైంది. జూలైలో 9.35 మీటర్లుగా నమోదుకాగా, నెల రోజుల కాలంలో 1.09 మీటర్ల భూగర్భ జలాలు పడిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో 0.42 మీటర్ల లోతులోనే నీటిమట్టం ఉండగా, కొత్తగూడెంలో అత్యధికంగా 34.16 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది.

చెరువులు ఏ మేరకు నిండాయంటే

జిల్లాలో చెరువులు, కుంటలు 2,384 ఉండగా పావుశాతం వరకు పూర్తిగా నిండాయి. 829 చెరువులు 25శాతం, 930 చెరువులు 25నుంచి 50శాతం, 619 చెరువులు 50 నుంచి 75 శాతంతో నీటితో నిండాయి. 421 చెరువుల్లో 75నుంచి 100 శాతం వరకు నీరు చేరగా, 60 చెరువులు అలుగు పోశాయి.

మండలం సాధారణం కురిసినది

కరకగూడెం 892.2 557.2

పినపాక 884.2 495.4

చర్ల 982.4 702.2

దుమ్ముగూడెం 941.3 508.4

అశ్వాపురం 854.4 588.0

మణుగూరు 930.4 456.8

ఆళ్లపల్లి 735.0 563.4

గుండాల 737.6 598.6

ఇల్లెందు 766.5 731.4

టేకులపల్లి 716.5 582.0

జూలూరుపాడు 712.2 620.2

చండ్రుగొండ 710.5 750.8

మండలం సాధారణం కురిసినది

అన్నపురెడ్డిపల్లి 734.7 481.1

చుంచుపల్లి 740.7 511.2

సుజాతనగర్‌ 717.9 525.0

కొత్తగూడెం 759.2 642.6

లక్ష్మీదేవిపల్లి 731.3 539.8

పాల్వంచ 807.4 589.6

బూర్గంపాడు 870.3 443.4

భద్రాచలం 817.3 377.0

ములకలపల్లి 838.9 479.0

దమ్మపేట 793.4 289.2

అశ్వారావుపేట 712.6 329.6

జిల్లా సరాసరి 799.0 537.5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement