టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ
మణుగూరుటౌన్: సింగరేణిలో గుర్తింపు, ప్రాతి నిధ్య కార్మిక సంఘాలు సంక్షేమాన్ని విస్మరించాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ విమర్శించా రు. శనివారం పీకేఓసీ–2 గేట్ సమావేశంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, 1000 రోజుల ప్రజా పీడన అని విమర్శించారు. కార్మికులకు ఎన్నికల సమయాల్లో హామీలు ఇచ్చిన గెలిచిన యూనియన్లు వాటిని మరిపోయాయని ఆరోపించారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలు కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. 100శాతం ఇన్‌వాలిడేషన్ చేయాలని, రూ.60 వేల కోట్ల బకాయి చెల్లించాలని డిమాండ్ చేశా రు. అనంతరం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు నాగెల్లి వెంకట్, వూకంటి ప్రభాకర్‌రావు, జంగం రాజ్‌కుమార్, మునిగెల నాగేశ్వరరావు, సుద్దాల సంపత్‌కుమార్, మురళీకృష్ణ, బద్దుల ప్రవీణ్, బీఆర్‌ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, వట్టం రాంబాబు, కుంట లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ సీటు
సాధించిన పేదింటి బిడ్డ
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినా యకపురం కాలనీకి చెందిన గ్రామదీపిక కొయ్య లక్ష్మి–శ్రీనివాస్ దంపతుల కుమారుడు మణిదీప్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు. నీట్–2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 1,59,399, స్టేట్ మెరిట్ ర్యాంక్ 3,007 సాధించి నాగర్ కర్నూల్ ప్రభు త్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటుకు అర్హత పొందాడు. పేద కుటుంబానికి చెందిన మణిదీప్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాలేరులోని జవహర్ నవోదయలో విద్యనభ్యసించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువు రు అభినందించారు.
ఓసీ పనులు
వేగవంతం చేయాలి
ఇల్లెందు: ఇల్లెందు ఏరియాలో పూసపల్లి ఓసీ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన కేఓసీ, పూసపల్లి ఓసీ ప్రాంతాలను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. నిర్ణీతకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం రొంపేడు –1 ఇంక్లైన్ ప్రాంతాన్ని సందర్శించి మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. విజయలక్ష్మి నగర్‌లో పర్యటించి అధికారులతో చర్చించారు. జీఎం వీసం కృష్ణయ్య, ఇతర అధికారులు రామదాసు, జాకీర్ హుస్సేన్, మాధవరా వు, రవికుమార్, నాగరాజు నాయక్, ప్రభాకర్, రామ్మూర్తి, దిలీప్‌కుమార్, శివ వీరకుమార్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అండర్–16
టోర్నమెంట్‌కు ఎంపిక
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్–16 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు నుంచి ఎంపికయ్యారు. ప్రసన్న కుమార్, ఉజ్వల్ గణేష్, సాయి కిశోర్, చైతన్య సాయి, దీపక్ నాయక్, ధీరాజ్ ఎంపికై న వారిలో ఉన్నారు. ఈ మేరకు కోచ్ చరణ్ తేజ శనివారం వివరాలు వెల్లడించారు.
రేషన్ బియ్యం
స్వాధీనం
బూర్గంపాడు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మణుగూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని క్రాస్‌రోడ్డు వద్ద స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులు మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్, చింతూరుకు చెందిన అజ్గర్‌అలీపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మేడ ప్రసాద్ తెలిపారు.
హత్యకేసులో
మరో నలుగురు అరెస్ట్
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన సింహాద్రి శివ హత్యకేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మణుగూరులోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మైదానంలో ఎంకే గ్యాంగ్ కొట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. తాజాగా మిగిలిన శివరాత్రి సాంబశివరావు, నాగేంద్రబాబు, చాబోతుల యేసు, పల్ల పు మల్లికార్జున్‌లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ నాగబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.


