ఉపాధ్యాయులది గురుతర బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులది గురుతర బాధ్యత

Sep 6 2026 12:25 AM | Updated on Sep 6 2026 12:25 AM

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: ఉపాధ్యాయులది వృత్తి మాత్రమే కాద ని, గురుతర బాధ్యత అని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినో త్సవం సందర్భంగా గిరిజన భవన్‌లో నిర్వహించిన గురుపూజోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుడు విద్యార్థుల జీవితా నికి, ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శిగా ఉంటాడని పేర్కొన్నారు. అనంతరం వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను సత్కరించారు. ఉత్తమ టీచర్లకు పురస్కారాలు అందజేశారు. ఉద్దీపకం–3, వారధి రూపకల్పనలో సహాయ సహకారాలు ఆర్పీలకు, క్రీడలలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిన పీడీ, పీఈటీలకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉపాధ్యాయులు ఐటీడీఏ అధికారులను సన్మానించారు. అధికారులు డేవిడ్‌రాజ్‌,చందన, అరుణకుమారి, రమేష్‌, రాము లు, రాధమ్మ, చంద్రమోహన్‌, భారతీదేవి, వీరు నాయక్‌, గోపాలరావు, అలివేలు మంగతాయారు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement