చర్ల: చర్లకు చెందిన 6వ తరగతి విద్యార్థిని లేక్ష్యశ్రీ హైదరాబాద్‌లో జరిగిన కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. దీంతో చిన్నారిని శనివారం వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యకరమంలో పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, గోగి కార్ రామలక్ష్మణ్, వేములపల్లి ప్రవీణ్ బాబు, వరలక్ష్మి సంతోష్, ముఖేష్, గాదంశెట్టి ప్రసన్నలక్ష్మి, గాదంశెట్టి సుధారాణి, నంబూరి అశ్విని పాల్గొన్నారు.
కొత్త ప్లాంట్ కోసం
ఐక్యంగా కృషి చేయాలి
పాల్వంచ: పాల్వంచలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలని పలువురు ప్రముఖులు, నాయకులు అన్నారు. శనివారం కేటీపీఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్‌లో పవర్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాల్వంచ భవిష్యత్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల కలిసి పోరాటాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలోడిప్యూటీ మేయర్ లలితకుమారి, నాయకులు,కార్పొరేటర్లు సీతారామి రెడ్డి, మంగీలాల్,సమీర్, యాస్మీన్, సుగుణ, భవిత, శ్రీను,జీవీఆర్, మధుచంద్, కీర్తి, కొత్వాల శ్రీనివాసరావు, శివరాంప్రసాద్, మహిపతి రామలింగం, కార్మిక సంఘాలనాయకులు తదితరులు పాల్గొన్నారు.


