సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రీ సర్వే ప్రక్రి య తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నా రు. ఇంకా పది మండలాల్లో సర్వే ప్రారంభమే కాలేదని అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఆన్‌లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎస్‌డీసీ, ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు సర్వే, రీ సర్వే పనులు మిషన్ మోడ్ విధానంలో పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్లు, సర్వేయర్లు రీ సర్వేను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ మండలంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు సర్వేయర్లతో సర్వే చేయించాలన్నారు. తక్షణమే కొత్తగూడెం, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, జూలూరుపాడు, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో గ్రామసభలు నిర్వహించి రీ సర్వే ప్రారంభించాలని ల్యాండ్ సర్వే ఏడి శ్రీనివాసులును ఆదేశించారు. కేవలం పాల్వంచ ప్రాంతంలోనే తొమ్మిది సర్వే నంబర్లు ఉన్నాయని, వాటిలో నాలుగు సర్వే నంబర్లలో సర్వే పూర్తయిందని తెలి పారు. మిగతా నంబర్లలో కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తిచేసేలా సర్వేయర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కలెక్టర్ అంకిత్


