గ్రామదేవతలకు ఎంపీ పూజలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడిన పాలకులు బతికి బట్టకట్టిన దాఖలాలు లేవని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను నిలదీస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర చేశారు. కొత్తగూడెం మార్కెట్ యార్డు నుంచి సూపర్ బజార్ వరకు ప్లకార్డులు చేబూని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనతో ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించా డని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి విద్యార్థులు, యువతను అరి గోస పెడుతున్నారని అన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు గుదిబండగా మారే జీఓ నంబర్97ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, పార్టీ మండల అధ్యక్షులు, కార్పోరేటర్లు, మాజీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్ గ్రామపంచాయతీలో ముత్యాలమ్మ, నాభిశిల విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సర్పంచ్ వల్లాల మంగమ్మ, ఆలయ కమిటీ పెద్దలు చిట్టిబాబు, వరద రాంచందర్, ఆళ్ళ నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, వల్లాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర


