ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
కొత్తగూడెంఅర్బన్: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో శనివా రం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పలు పాఠశాలల చిన్నారులు నృత్యాలతో అలరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. డీఈఓ డి.వాసంతి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. వీరబాబు కూడా ప్రసంగించారు. ఆ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులు 50 మందికి అవా ర్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్‌సింగ్, ఆర్డీఓ మధు, ఏసీ మాధవరావు, ఏఎంఓ మాధవరావు, ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్, డీఎస్‌ఓ సంపతకుమార్, జీసీడీఓ జానకి తదితరులు పాల్గొన్నారు.


