భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం ఉట్ల ఉత్సవాన్ని కమనీయంగా జరిపారు. శ్రీ కృష్ణాష్టమి మరుసటి రోజున దేవస్థానంలో ఉట్ల వేడుకను జరపటం ఆనవాయితీ. స్వామివారికి ఆలయ ప్రాంగణంలోనే తిరువీధి సేవ జరిపారు. అనంతరం యటపాకకు చెందిన యాదవ వంశస్తులు ఉట్టి కొట్టే వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, అర్చకులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన
గోదావరి పుష్కరాల పనులలో భాగంగా భక్తుల కోసం ఆదివారం డార్మెటరీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అంబసత్రం ఎదురుగా ఉన్న సంస్కృతి పాఠశాల స్థలంలో జీ ప్లస్ వన్ నిర్మాణం చేపట్టనున్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. స్వా మివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.


