చుంచుపల్లి: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగూడేనికి చెందిన ఇద్ద రు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. బాబూక్యాంపు పీఎంశ్రీ ప్రభు త్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూ రుగు నీరజ, కొత్తగూడెం ఎస్‌ఆర్ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.అనురాధలను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన, ఆర్జేడీ డాక్టర్ బాలభాస్కర్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. విద్యారంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.


