అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఒకే రోజు ఐదు ప్రసవాలు జరిగాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రోజు రాత్రి 9గంటలోపు ఐదుగురు గర్భిణులు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో నలుగురు గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయగా, కాన్పు కష్టమైన మరో గర్భిణికి సిజేరియన్ చేసి శిశువు ప్రాణాలు కాపాడినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. మెరుగైన సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.


