ఉద్యోగాలకు ఎంపిక
పాల్వంచరూరల్: ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, వారి ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకుండా పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన బోధన, మెనూను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశాక మాట్లాడారు. కూరల్లో కారం ఘాటు తగ్గించాలని హెచ్‌ఎంకు సూచించి, రాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లకుండా ఏఎన్‌ఎంలు పర్యవేక్షించాలన్నారు. అలాగే, ఉద్దీపకం వర్క్‌బుక్‌ల ద్వారా బోధన, ఇతర అంశాలపై సూచనలు చేశారు. ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్‌సీఆర్ హిరాలాల్, హెచ్‌ఎం విజయలక్ష్మి, సర్పంచ్ వజ్జ లలిత, ఉప సర్పంచ్ రాంబాబు ఉన్నారు.
పోటీ పరీక్షల్లో రాణించేందుకే ‘వారధి’
భద్రాచలంటౌన్: గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ‘వారధి’ పుస్తకాన్ని రూపొందించినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బీఈడీ కళాశాలలో ఇంగ్లిష్, గణితం ఉపాధ్యాయులకు బుధవారం నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరైన ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల కోసం వారానికి మూడు‘వారధి’ తరగతులు నిర్వహించాలని సూచించారు.
భద్రాచలంలోని యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 74 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వైటీసీలో ఐటీ హెల్ప్‌డెస్క్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారిలో 40మంది రిజల్యూట్ స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్‌కు, 34మంది ఫాక్స్‌కాన్‌కంపెనీకి ఎంపిక కాగా పీఓ రాహుల్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీ చందన, ఈఈ మధుకర్, ఏసీఎంవోలు రమేష్, రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏపీవో డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, డీడీ చందన, ఈఈ మధుకర్, వైటీసీ మేనేజర్ శ్రీను, ఏసీఎంఓలు రమేష్, రాములు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


