ప్రస్తుతం పత్తి పూత, కాత దశలో ఉండడంతో పంట చేతికి రాగానే కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్లోరోక్విన్ మాత్రలు తీసుకుని అస్వస్థతకు గురైన వారు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి వచ్చినా సకాలంలో వైద్యం అందించిన భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం నుంచి ‘ఎక్స్’ వేదికగా ప్రకటన జారీ చేశారు. చిన్నారులు, పెద్దలను గొల్లగుప్ప నుంచి ఆస్పత్రికి తరలించగా, వైద్య బృందం వెంటనే స్పందించి మెరుగైన చికిత్స అందించిందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.


