పత్తికి.. పక్కా ప్లాన్‌! | - | Sakshi
Sakshi News home page

పత్తికి.. పక్కా ప్లాన్‌!

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మార్కెట్ల పరిధిలో సీసీఐ కొనుగోళ్లు

15 జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాట్లు

4.71 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.8,667

అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సెప్టెంబర్‌ నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈక్రమాన కేంద్ర ప్రభుత్వం రూ.8,667ల మద్దతు ధరతో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా వ్యవసాయ మార్కెట్లను సీసీఐ కేంద్రంగా చేసి, ఆయా మార్కెట్ల పరిధిలోని జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిన్నింగ్‌ మిల్లులు పత్తి కొనుగోలుకు టెండర్లు వేసిన తరువాత, సీసీఐ అంగీకారంతో అందించే నివేదికల ఆధారంగా కలెక్టర్‌ జిన్నింగ్‌ మిల్లులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.

అందుబాటులో తొమ్మిది మార్కెట్లు..

పత్తి సాగు చేసే ప్రాంతాల ఆధారంగా రైతులకు అందుబాటులో ఉండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది వ్యవసాయ మార్కెట్ల పరిధిలో పత్తి కొనుగోళ్లకు నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా వ్యవసాయ మార్కెట్లతో పాటు ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో కూడా పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. నేలకొండపల్లి వ్యవసా య మార్కెట్‌ పరిధిలో ఉన్న ముదిగొండ మండలా న్ని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోకి చేర్చి ఆ మండలంలోని జిన్నింగ్‌ మిల్లు నుంచి పత్తి కొనుగోళ్లకు నిర్ణయించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని ఆరు జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. గత ఏడాది నాలుగు జిన్నింగ్‌ మిల్లుల్లో నిర్వహించిన కొనుగోళ్లు ఈ ఏడాది మరో రెండు మిల్లుల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌తోనే..

పత్తి విక్రయాల్లో గత ఏడాది అవలంబించిన కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారానే ఈ ఏడాది కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకొని పత్తిని విక్రయించుకోవచ్చు. విక్రయాల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 5779, వాట్సాప్‌ చాట్‌ బాట్‌ నంబర్‌ 88972 81111ను కూడా అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేస్తున్నారు.

4.71 లక్షల ఎకరాల్లో సాగు..

ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు మెట్ట పంటగా 4,71,085 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 2,34,566 ఎకరాలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,36,515 ఎకరాల్లో సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, బోనకల్‌, ముదిగొండ, కారేపల్లి, కామేపల్లి, ఏన్కూ రు, వైరా, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల్లో సాగు చేయగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, సుజాతనగర్‌, టేకులపల్లి, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ, ఇల్లెందు, గుండాల, పినపాక, మణుగూరు, అశ్వాపురం తదితర మండలాల్లో పత్తిని సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది.

వ్యవసాయ మార్కెట్‌ జిన్నింగ్‌ మిల్లు

ఖమ్మం జీఆర్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ వెంకటగిరి,

ఖమ్మం రూరల్‌ మండలం

శ్రీ సాయిబాలాజీ జన్నింగ్‌ అండ్‌ ఆయిల్‌ మిల్‌

తల్లంపాడు, ఖమ్మం రూరల్‌ మండలం

మద్దులపల్లి శ్రీ భాగ్యలక్ష్మి కాటన్‌ ఇండస్ట్రీ, గోలితండా,

తిరుమలాయపాలెం మండలం

జీఆర్‌ఆర్‌ జిన్నింగ్‌ మిల్స్‌, పొన్నెకల్లు

మధిర మంజీర కాటన్‌ లిమిటెడ్‌, మాటూరు

కనకదుర్గా కాటన్‌ ఇండస్ట్రీస్‌, మధిర

శ్రీ శివ గణేష్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌, ఇల్లెందులపాడు

వైరా స్టాప్లరిచ్‌ జిన్నింగ్‌ ఇండస్ట్రీస్‌, తల్లాడ

మత్కేపల్లి శ్రీ లీల కాటన్‌ ఇండస్ట్రీ, ముదిగొండ

కొత్తగూడెం మంజిత్‌ కాటన్‌ జిన్నింగ్‌ మిల్‌, సుజాత్‌నగర్‌

బూర్గంపాడు అనుశ్రీ ఇండస్ట్రీస్‌, బూర్గంపాడు

శ్రీలక్ష్మీనరసింహా కాటన్‌ ఇండస్ట్రీ, బూర్గంపాడు

రమేష్‌, కాటన్‌ ఇండస్ట్రీస్‌, బూర్గంపాడు

భద్రాచలం శ్రీరామా కాటన్‌ జిన్నింగ్‌ మిల్‌, అశ్వాపురం

ఇల్లెందు శ్రీలక్ష్మీప్రియ కాటెక్స్‌ జిన్నింగ్‌ మిల్‌, కారేపల్లి

సెప్టెంబర్‌ నుంచే

కొనుగోళ్లకు రెడీ..

జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణానికి అనుకూలంగా, పంట పడించే ప్రాంతాలకు అనువుగా సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

– రత్నం సతోష్‌కుమార్‌,

జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement