సైబర్‌ మోసాల బారిన పడొద్దు.. | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాల బారిన పడొద్దు..

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

ఎస్పీ రోహిత్‌ రాజు

జూలూరుపాడు(సుజాతనగర్‌): విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సైబర్‌ మోసాల బారిన పడొద్దని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. సుజాతనగర్‌ మండలం వేపలగడ్డలోని అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్‌ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డిజిటల్‌ అరెస్ట్‌, పెట్టుబడులపై లాభాలు వంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సూచించారు. అంతేకాక సోషల్‌ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్‌ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బందులు వస్తయని తెలిపారు. కాగా, సైబర్‌ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాక డ్రగ్స్‌ అలవాటు చేసుకుని విలువైన జీవితాలను కోల్పోవద్దని ఎస్పీ హితవు పలికారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించగా.. సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా, డ్రగ్స్‌, పోక్సో కేసులు, వ్యక్తిగత భద్రత అంశాలపై సమాధానాలు ఇచ్చారు. అనంతరం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యాన రూపొందించిన క్యాలెండర్లను ఆవి ష్కరించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఆర్‌.వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, జుబేదాబేగం, కల్యాణి, రమాదేవి పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి అడ్లూరి

పర్యటన రద్దు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏలో ఈనెల 5వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పర్యటన రద్దయింది. మంత్రి ఐటీడీఏను సందర్శించి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షిస్తారని తొలుత షెడ్యూల్‌ వెల్లడించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆయన పర్యటన రద్దయినట్లు బుధవారం సమాచారం అందింది.

నానో వినియోగంతో మరింత ప్రయోజనం

ఇల్లెందురూరల్‌: నానో యూరియా, డీఏపీ విని యోగంతో రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికా రి బాబూరావు అన్నారు. మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామంలో నానో యూరియా, డీఏపీ ద్రవరూప ఎరువును డ్రోన్‌ ద్వారా పిచి కారీ చేసే విధానంపై వ్యవసాయశాఖ ఆధ్వర్యాన బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో యూరియా, డీఏపీ, పొటాష్‌ ఎరువులు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా ద్రవరూపంలోని నానో యూరియా, డీఏపీ పిచికారీకి డ్రోన్‌ వాడకం వల్ల సమయం ఆదా అవుతుందని, కూలీల కొరతను కూడా అధిగమించవచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అరెం ప్రియాంక, ఉపసర్పంచ్‌ అరెం కిరణ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టెల కృష్ణ, ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్స్‌ జిల్లా అధ్యక్షుడు సోమసుందర్‌, ఉపాధ్యక్షుడు రామలింగయ్య, వ్యామసాని జనార్థన్‌, నారాయణదాస్‌ లాహో టి, ఏడీఏ లాల్‌చంద్‌, ఏవో సతీష్‌, టెక్నికల్‌ ఏఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయం

ములకలపల్లి: హైదరాబాద్‌లో నర్స్‌ అత్యాచారం, హత్య ఘటనపై హోం మంత్రిత్వ శాఖ చూస్తున్నసీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం గర్హనీయమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ములకలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నర్సు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించి, మాట్లాడారు. ఘటనపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా సత్వర విచారణ జరిపించి, ఆరు నెలల్లోగా నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.50 వేల నగదు సాయం అందజేశారు. కాగా, బాధిత కుటుంబంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. గటనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సర్పంచ్‌ తానం పద్మ, నాయకులు ఉప్పల వెంకటరమణ, ఒగ్గెల పూజ, మోరంపూడి అప్పారావు, తాండ్ర రాంబాబు, పుష్పాల చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

●కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు హైదరాబాద్‌లో నర్స్‌గా పనిచేస్తున్న గిరిజన యువతి దారుణ హత్య ఘటన బాధాకరమని జనసేన నాయకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20వేల ఆర్థిక సాయం అందజేసి ఆయన మాట్లాడారు. నాయకులు తాటికొండ ప్రవీణ్‌, గరికె రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement