హైదరాబాద్‌లో నర్స్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నర్స్‌ మృతి

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

భద్రాచలంఅర్బన్‌: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నర్స్‌(25) అనుమానాస్పద స్థితిల్లో మృతి చెందింది. భద్రాచలానికి చెందిన ఆమె నర్సింగ్‌ పూర్తి చేశాక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యుడి వద్ద పనిచేస్తోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమెను 10–30 గంటల సమయాన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఆతర్వాత అరగంటకే మృతి చెందినట్లు సమాచారం చేరింది. యువతి ఏదో ఇంజక్షన్‌ చేసుకుందని తెలుస్తుండగా కుటుంబీకులు హైదరాబాద్‌ వెళ్లారు. కాగా, ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమెకు తీవ్ర జ్వరం, ఛాతినొప్పి ఉన్నాయని, చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరగగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అత్తారింటికి వెళ్తూ

అనంతలోకాలకు..

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరు దుర్మరణం

అశ్వారావుపేటరూరల్‌: అత్తారింటికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్‌ఐ టి.యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని జీలుగుమిల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన దాబా మంగబాబు(30) ద్విచక్రవాహనంపై కొల్లూరిగూడెంలోని అత్తారింటికి వెళ్తున్నాడు. ఈక్రమాన అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం శివారుల మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంగబాబుకు తీవ్ర గాయాలు కాగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య సంధ్య ,ఇద్దరు సంతానం ఉన్నారు. ఘటనపై మంగబాబు భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గోవులు తరలిస్తున్న

కంటైనర్‌ పట్టివేత

దమ్మపేట: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఆవులతో వెళ్తున్న కంటైనర్‌ లారీని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యనగర్‌ గో సంరక్షణ సమితి వారి సమాచారం మేరకు పోలీసులు మండలంలోని మందలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద గోవులతో వెళ్తున్న కంటైనర్‌ లారీను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిశీలించగా.. 90 ఆవులు ఒకదానిని మరొ కటి కనిపించాయి. దీంతో ఆవులను ఏపీలోని నూజి వీడు సమీపంలోని గోశాలకు తరలించి, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాజేష్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement