●ఇక్కడ నో అడ్మిషన్స్‌..! | - | Sakshi
Sakshi News home page

●ఇక్కడ నో అడ్మిషన్స్‌..!

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎప్పుడైనా దొరుకుతాయనుకుంటే పొరపాటే.. సీట్లు లేవని చెప్పినా అదే పాఠశాలలకు రావడంతో చివరకు స్కూల్‌ గేటుకు ‘నో అడ్మిషన్‌’బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఇదెక్కడో కాదండి పాల్వంచ పట్టణం కేటీపీఎస్‌ కాలనీలోని ప్రభుత్వ పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ అభ్యుదయ బాలికోన్నత హైస్కూల్లోనే. ఈ విద్యాసంవత్సరంలో 6 నుంచి 10వ తరగతుల్లో 587 మంది విద్యార్థినులకు గాను 603 మంది చేరారు. గతేడాది కేవలం 533 మంది మాత్రమే ఉండగా.. ఈసారి పోటీపడి చేరడంతో తరగతి గదులన్నీ నిండిపోయాయి. వరండాలో కూర్చోబెట్టి మరీ చదువులు చెప్పించాల్సి వస్తోందని, అందుకే నో అడ్మిషన్‌ బోర్డు పెట్టినట్లు హెచ్‌ఎం రమాదేవి తెలిపారు. – పాల్వంచరూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement