40 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

40 కేజీల గంజాయి స్వాధీనం

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

అశ్వాపురం: మండల పరిధిలోని గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్ట్‌ కెనాల్‌ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 40.560 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత నెల 30న ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి భద్రాచలం, మణుగూరు, ఏటూరునాగారం మీదుగా షిర్డీకి టాటా నెక్సాన్‌ కారులో భార్యాభర్తలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అశ్వాపురం ఎస్‌ఐ రాజేష్‌ తన సిబ్బందితో గొల్లగూడెం గ్రామ శివారులోని సీతారాం కెనాల్‌ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో ఓడీ 30ఈ 0342 నంబర్‌ గల టాటా నెక్సాన్‌ కారు ను ఆపి తనిఖీ చేయగా కారులో తరలిస్తున్న 40.560 కిలోల గంజాయి పట్టుబడిందని, దీని విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందన్నారు. గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన అరబిందో బిశ్వాస్‌ అతని భార్య సుప్రియ బిశ్వాస్‌లు కలిమెలలోని సాలబాగ్‌ గ్రామానికి చెందిన హరిశ్చంద్ర మిసీ్త్ర, సుశాంత్‌ మండల్‌ వద్ద గంజాయిని తీసుకుని షిర్డీలోని రోహిత్‌ యాబిన్‌ అనే వ్యక్తికి సరఫరా చేసేందుకు వెళ్తున్నట్లు అంగీకరిచారన్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేష్‌ ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఎల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీస్‌ శాఖకు సహరించాలని కోరారు.

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement