ఉరి వేసుకుని ఐటీ ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

మూసాపేట: ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన ములుగురి రమేష్‌(40)కు రాధికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కూకట్‌పల్లి దేవీనగర్‌లోని భాస్కర ప్యాలెస్‌లో నివాసం ఉంటూ ఐటీ ఉద్యోగిగా ఆయన పనిచేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన రాధిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె అక్క, తమ్ము డు వచ్చారు. ట్యాంక్‌ బండ్‌కు వెళ్దామని అడగగా రమేష్‌ రానని చెప్పడంతో మిగతా వారు వెళ్లారు. అర్ధరాత్రి రాత్రి 12:30కు భార్య రాధికకు ‘పారపాటు జరిగింది సారీ గుడ్‌ బై’అని మెసేజ్‌ పెట్టడంతో ఇంటికి వచ్చి చూడగా అప్పటికే రమేష్‌ చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

బూర్గంపాడు: సారపాకకు చెందిన కొండేటి సాయి(30) అప్పుల బాధతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన ఆయనను కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు భద్రాచలం ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఘటనపై ఆన తల్లి నాగమణి ఫిర్యాదుతో కేసు నమోద చేసినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ తెలిపారు.

మైనర్‌కు పెళ్లి.. నలుగురిపై కేసు

భద్రాచలంఅర్బన్‌: మైనర్‌ పెళ్లి ఘటనలో నలుగురిపై భద్రాచలం టౌన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం పట్టణంలోని కేసీఆర్‌ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికకు వివాహం జరిపించారు. ఈక్రమాన ఐసీడీఎస్‌ అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో భద్రాచలం టౌన్‌ పోలీసులు ఆ పెళ్లికి సహకరించిన వరుడితో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement