సూపర్‌బజార్(కొత్తగూడెం): కాంగ్రెస్ వేయి రోజుల పాలన ప్రజారంజకంగా సాగిందని డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీలో ఉన్న మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు, దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలతో పది సంవత్సరాలపాటు కుటుంబ పాలన సాగించి రాష్ట్రాన్ని దోచుకుని, దాచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు, వరి పంటకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 15 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, కోటి కుటుంబాలకు సన్నబియ్యం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, 72 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. నాయకులు ఆళ్ల మురళి, చీకటి కార్తీక్, వై.శ్రీనివాస్ రెడ్డి, మంద హనుమంతు, ఎస్కే జానీ పాషా, కొదుమూరి శ్రీనివాసరావు, పైడా రాజేంద్రప్రసాద్, లోశెట్టి నాగార్జున, ఆంతోటి పాల్, చింతలపూడి రాజశేఖర్ పాల్గొన్నారు.
అభివృద్ధిలో ముందంజ
చర్ల: వేయి రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రం అనిన రంగాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాదరావు అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు కె.విజయకుమార్ నాయుడు, నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, కొసరాజు రాజా, పిలకా వెంకటరమణరెడ్డి, లంక రాజు, చీమకుర్తి సాయి చరణ్, మురళీదర్‌నాయుడు, చింతూరి రజనీకాంత్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న


