సీఎస్సార్‌ నిధులతో ‘పోలీస్‌’ హాల్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎస్సార్‌ నిధులతో ‘పోలీస్‌’ హాల్‌

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

మణుగూరు టౌన్‌: మణుగూరులో పోలీస్‌శాఖ నిర్మించనున్న కౌన్సెలింగ్‌, ఫిర్యాదుల పరిష్కార హాల్‌ నిర్మాణానికి సింగరేణి సీఎస్సార్‌ నిధులు రూ.50 లక్షలు మంజూరు చేశారు. రెండో విడత రూ.25 లక్షల చెక్కును ఎస్పీ రోహిత్‌రాజుకు ఆయన చాంబర్‌లో మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రూ.50 లక్షల్లో గతంలోనే రూ.25 లక్షలు అందజేశామని, మిగిలిన ప్రస్తుతం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం(పర్సనల్‌) సలగల రమేశ్‌, డీజీఎం(సీవిల్‌) శివ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయ రోడ్డు పనుల పరిశీలన

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా నూతన పోలీస్‌ కార్యాలయ సముదాయానికి నిర్మిస్తున్న రోడ్డు మార్గం పనులను ఎస్పీ రోహిత్‌ రాజు మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. కొండ ప్రాంతాలు, సరిహద్దు భూభాగాల్లో రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్‌.సతీష్‌ కుమార్‌, ఇతర అధికారులు శ్రీనివాస్‌, కృష్ణారావు, రమణారెడ్డి, సాయి కిషోర్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.25 లక్షల చెక్కు అందజేసిన

సింగరేణి జీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement