భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన క్రికెటర్ గురువిద్వా హైదరాబాద్‌లో జరుగుతున్న అండర్–19 స్టేట్ ప్రాబబుల్స్ క్రికెట్ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. వరుస మ్యాచ్‌ల్లో 70, 101 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గతంలో అండర్–14, అండర్–16 జాతీయ పోటీల్లోనూ రాణించిన ఇతడు ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా గురువిద్వాను కోచ్ చరణ్ తేజ, స్థానికులు అభినందించారు.
మైనర్‌కు పెళ్లి..
రిసెప్షన్‌కు బ్రేక్
భద్రాచలంఅర్బన్: బాలికకు వివాహం జరిపి రిసెప్షన్ నిర్వహిస్తుండగా మంగళవారం ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని కేసీఆర్ కాలనీలో జరుగుతున్న రిసెప్షన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. బాల్య వివాహం జరిపినట్లు గుర్తించిన ఐసీడీఎస్ అధి కారులు బాలిక తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.


