చుంచుపల్లి: అటవీ, వన్యప్రాణులు, సహజ వనరుల సంరక్షణ కోసం పటిష్ట కార్యాచరణతో ప్రణా ళిక రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అధికారులు, సిబ్బందికి సూచించారు. భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ భీమానాయక్‌తో కలిసి మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్‌ఓలు,ఎఫ్‌డీఓలు, ఇతర అటవీ అధికారులతో సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అక్రమ వేట నివారణ, అటవీ నేరాల నియంత్రణ, గస్తీ వ్యవస్థ, ముందస్తు సమాచార సేకరణ, వివిధ శాఖల సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం వినియో గం, ఫ్రంట్‌లైన్ సిబ్బంది భద్రత, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఎఫ్ బీఓ నవీన్ మృతి ఘటన మరలా పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలన్నారు.
కిన్నెరసాని డివిజన్‌లో పరిశీలన..
పీసీసీఎఫ్ వినయ్ కుమార్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ డాక్టర్ భీమా నాయక్‌తో కలిసి కిన్నెరసాని డీర్ పార్క్‌ను సందర్శించి, డివిజన్‌లో చేపడుతున్న అటవీ సంరక్షణ, వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాలు, సందర్శకుల సౌకర్యాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఖమ్మం డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, పలువురు ఎఫ్‌డీఓలు, రేంజ్ ఆఫీసర్లు, అధికారులు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
పీసీసీఎఫ్ వినయ్‌కుమార్


