చుంచుపల్లి: పేషంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవా రం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలోని ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూ నిట్)తో పాటు జనరల్ వార్డును పరిశీలించారు. పేషంట్లకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, ఇతర వసతులపై ఆరా తీశారు. ఈ సమయాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోగా.. ఇటీవల బదిలీపై వచ్చానని అందుబాటులో ఉన్న ఓ మహిళా వైద్యురాలు సమాధానమిచ్చారు. ఆస్పత్రిలో మందుల కొరత ఉందంటూ తనకు పలు ఫిర్యాదులు అందాయని, ఇలా మరోమారు ఫిర్యాదులు రాకుండా చూడాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.


