జూలూరుపాడు: యాష్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా ఢీకొట్టిన ఘటన మంగళవారం మండలంలోని పడమటనర్సాపురంలో చోటుచేసుకుంది. ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఇసుక లారీ, పాల్వంచ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తున్న యాష్ ట్యాంకర్ పడమటనర్సాపురం జీపీ వద్ద ఢీకొనడంతో ట్యాంకర్ డ్రైవర్ ఏసుబు క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. రెండు కాళ్లు విరగడంతో కేకలు వేస్తుండగా స్థానికులు బయటకు తీసి, కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. కాగా, రహదారిపై అడ్డంగా వాహనాలు నిలిచిపోగా పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


