పీఆర్‌సీ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ అమలు చేయాలి

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

పాల్వంచ: పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు అమలు చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి అన్నారు. ఆదివారం ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్యను దూరం చేసేలా రాష్ట్రంలోని 23వేల పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆరోపించారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్‌, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని, సీఆర్టీల సర్వీస్‌ను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 20శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ దర్శిని పత్రిక ప్రధాన సంపాదకుడు ఎ.నాగిరెడ్డి, నాయకులు బి.రాజు, జె.రాంబాబు, బి.ప్రసాద్‌రావు, మాధవరెడ్డి, గంగరాజు, సరియా, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement