పెద్దమ్మగుడి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మగుడి వద్ద ట్రాఫిక్‌ జామ్‌

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

పాల్వంచరూరల్‌: మండలంలోని పెద్దమ్మగుడి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అంబికా, భవానీ ఫంక్షన్‌హాళ్ల వద్ద రహదారి మధ్యలో ఉన్న మార్గం నుంచి కారు రాంగ్‌ రూట్‌లో రావడంతో లారీ ఢీకొట్టింది. దీంతో లారీడ్రైవర్‌పై దాడి చేయగా.. ఎడమవైపు రహదారిపై కేశవాపురం వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుని లారీని అక్కడి నుంచి పక్కకు పంపించడంతో ట్రాఫిక్‌ ముందుకు కదిలింది.

కారును ఢీకొట్టిన లారీడ్రైవర్‌పై దాడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement