కోటి తలంబ్రాల మహాయజ్ఞం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కోటి తలంబ్రాల మహాయజ్ఞం ప్రారంభం

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 11వ కోటి తలంబ్రాల మహాయజ్ఞం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌ గ్రామానికి చెందిన శ్రీ భక్త రామదాసు భక్తమండలి పదేళ్లుగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి కోటి గోటి తలంబ్రాలను సమర్పిస్తోంది. వచ్చే శ్రీరామనవమికి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిచేందుకు ఉపక్రమించింది. స్వామివారి సన్నిధిలో వరి విత్తనాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశా రు. విత్తనాలను పొలాల్లో చల్లి, పండిన వడ్లను మహిళలతో ప్రత్యేకంగా ఒలిపించనున్నారు. ఆ బియ్యాన్నే వచ్చే శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి తలంబ్రాలుగా సమర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదరరావు, ఏఈఓ శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

గురుకులంలో జోనల్‌ అధికారి తనిఖీ

కారేపల్లి: కారేపల్లిలోని శ్రీకవిత ఇంజనీరింగ్‌ కళాశాల భవన సముదాయంలో కొనసాగుతున్న ఇల్లెందు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని భద్రాద్రి జోనల్‌ అధికారి పోతల అపర్ణ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించారు. అంతేకాక విద్యార్థుల ప్రతిభను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అపర్ణ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారం స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా బాలురకు తిరుమలాయపాలెం, బాలికలకు టేకులపల్లిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలురకు అన్నపురెడ్డిపల్లిలో, బాలికలకు ములకలపల్లిలో కౌన్సెలింగ్‌ ఉంటుందని వెల్లడించారు. కాగా, గురుకుల సంక్షేమ పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. ప్రిన్సిపాల్‌ వాణి, వైస్‌ ప్రిన్సి పా ల్‌ రత్నలత, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

నేడు ఖమ్మంకు డీజీపీ..

ఖమ్మంక్రైం: రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్‌ సోమవారం ఖమ్మం రానున్నారు. పోలీస్‌ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం రాత్రి ఖమ్మంలో బసచేయనున్న డీజీపీ, మంగళవారం అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి డీజీపీ పర్యటన ఖరారైనా, మార్పులకు అవకాశముందని పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement