ట్రాక్టర్‌ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): ట్రాక్టర్‌ పైనుంచి జారిపడిన వ్యక్తి మీది నుంచి చక్రాలు పోవడంతో మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసు ల కథనం మేరకు.. రాజా పురం గ్రామానికి చెందిన చెన్నుబోయిన రామారావు (53) ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ పైనుంచి జారిపడగా.. దమ్ము చక్రాలు అతని పైనుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన రామరావును 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి నేత్రాలను డాక్టర్‌ అగర్వాల్‌ కంటి ఆస్పత్రికి అప్పగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయసింహారెడ్డి తెలిపారు.

పరారైన విద్యార్థి గుర్తింపు

పాల్వంచరూరల్‌: నాలుగు రోజుల క్రితం పాఠశాలలో చేరిన రోజే పరారైన విద్యార్థిని ఎట్టకేలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. కిన్నెర సాని డ్యామ్‌ సైడ్‌ గిరిజన గురుకుల పాఠశాల నుంచి కున్సోత్‌ మహేందర్‌ ఈ నెల 2వ తేదీన హెయిర్‌ కటింగ్‌ పేరుతో బయటకు వెళ్లి, తిరిగిరాలేదు. శనివా రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కన్పించినట్లు సమాచారం రావడంతో కానిస్టేబుల్‌, విద్యార్థి తండ్రి హైదరాబాద్‌ వెళ్లి ఆదివారం వచ్చారు. కాగా, కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో మణుగూరు ప్యాసింజర్‌ దిగి ఉన్న మహేందర్‌ను తండ్రి గుర్తించి ఇంటికి తీసుకెళ్లాడు. విద్యార్థి చదువుకోలేకనే స్కూల్‌ నుంచి కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు వెళ్లి, రైలు ఎక్కి సికింద్రాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి తిరిగి అదే రైలు ఎక్కి కొత్తగూడెంలో దిగాడని ప్రిన్సిపాల్‌ శ్యామ్‌ తెలిపారు.

గుడుంబా స్వాధీనం.. కేసు నమోదు

కరకగూడెం: కలవాలనాగారం అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి గుడుంబా నిల్వ చేసినట్లు గుర్తించి, అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పీవీఎన్‌ రావు తెలిపారు. గుడుంబా తయారీ, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement