కొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పెద్దబాబు, కోశాధికారి కొదుమూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నూకల రంగారావు, నాగార్జున, చీకటి కార్తీక్, నయీముద్దీన్, మజీద్, సమీర్, లక్ష్మణ్, రాము, భువనసుందర్‌రెడ్డి, అజయ్‌కుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులు, అభివృద్ధికి కట్టుబడి ఉంది..
ఆదివాసీల హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివాసీ కార్యకర్తల సమావేశం జరగగా ఆమె పాల్గొని మాట్లాడారు. ఇది ఆదివాసీల జిల్లా అని, జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలంటే ఆదివాసీలను కలుపుకొని పోవాల్సిందేనన్నారు. అనంతరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ కోఆర్డినేటర్, ఆదివాసీ విభాగం నాయకురాలు కుసుమ ఆలం మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ హయాంలో పంచాయత్ రాజ్ చట్టం, సోనియా గాంధీ హయాంలో అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని, ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో ఎం.ప్రసాద్‌బాబు, కొదుమూరి శ్రీనివాస్, పునం శ్రీనివాస్, చింతలపూడి రాజశేఖర్, తాటి అనిత, అజ్మీర లైలా, బానోతు రాణి, బానోతు జానీ, వజ్జా భాస్కర్, లావుడియా పూర్ణ, వరస నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


