గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

పాల్వంచ: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సంజయ్‌నగర్‌ వద్ద ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా 28.9 కేజీల గంజాయి లభించింది. ఇద్దరు వ్యక్తులు పరారు కాగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పాల్వంచ ప్రియదర్శినికాలనీకి చెందిన ఉప్పుగుండ్ల ప్రభాకర్‌గా గుర్తించారు. మరో ఇద్దరితో కలిసి ఆయన ఒడిశా రాష్ట్రం కలిమెల నుంచి మహబూబాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు తేలిందని, దీని విలువ రూ.14.45 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.34 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో సిబ్బంది హరిబాబు, జి.బుచ్చయ్య, హుస్సేన్‌, అబ్బురాములు, నాగేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పేకాట శిబిరంపై దాడి

దమ్మపేట: మండలంలోని పెద్దగొల్లగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దగొల్లగూడెం శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు ఎస్‌ఐ రాజేశ్‌కుమార్‌ పేకాట శిబిరంపై దాడి చేసి, పదకొండు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు బైక్‌లు, రూ.22,800 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement