ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
కొత్తగూడెంఅర్బన్: బూత్ కమిటీలే కాంగ్రెస్ పార్టీకి పునాదులని, రాబోయే ఎన్నికల్లో బీఎల్‌ఏల పాత్ర ఎంతో కీలకం కానుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం క్లబ్‌లో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర ఓటరు నమోదును నిర్ధారించడం, అర్హులైన ఓటర్లందరూ చురుకుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అన్నారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, అడ్రస్ మార్పులు ఫారం–6, 7, 8, ఎన్యుమరేట్ ఫారం ద్వారా వెంటనే చేయించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, నాయకులు కొత్వాల శ్రీను, ఆళ్ల మురళి, ఊకంటి గోపాలరావు, మండే వీర హనుమంతరావు, చీకటి కార్తీక్, అర్జున్ రావు, అంతోటి పాల్, ఎం ప్రసాద్ బాబు, మంద హనుమంతరావు, కొదుమూరి శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, నాగార్జున శ్రీనివాస్‌రెడ్డి, చింతలపూడి శేఖర్, రంగారావు, గద్దెల రమేష్, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


