చుంచుపల్లి: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతృ, శిశు మరణాలను తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. బుధవారం కొత్తగూడెంలో నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, శాంపిల్ సేకరణ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సిజేరియన్ ప్రసవాలను తగ్గించాలని సూచించారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ఏఎన్‌సీ పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణీల ప్రత్యేక ప్రొఫైల్‌ను గుర్తించాలన్నారు. అధికారులు సాయి కళ్యాణ్, ప్రతాప్, రాందాస్, దినేష్, రాకేష్, హరీష్ పాల్గొన్నారు.
8 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి
ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది (2000 బ్యాచ్)కి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిలో నలుగురిని భద్రాద్రి జిల్లాకు, ఇద్దరిని ఖమ్మం కమిషనరేట్‌కు, మహబూబాబాద్, ఇంటెలిజెన్స్‌కు ఒక్కొక్కరినీ కేటాయించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారు సీపీ సునీల్‌దత్‌ను బుధవారం కలవగా ఆయన అభినందించారు.


