ఎస్పీ రోహిత్ రాజు
జూలూరుపాడు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ బి.రోహిత్ రాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్ష ప్లాన్‌లో గుండెపుడిలో నిర్వహించిన రోడ్డు భద్రత గ్రామసభలో మాట్లాడారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని , స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వివరించారు. గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకుని, రోడ్డు భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, మోటారు వాహనాల అధికారి వెంకటరమణ, సీఐలు శ్రీనివాస్, శ్రీలక్ష్మి, ఇతర అధికారులు టి.శ్రీనివాస్, తాళ్లూరి రవి, రామారావు, బి.వెంకటేశ్వర్లు, తేజశ్వి, బాదావత్ రవి, రమాదేవి, ప్రవీణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.


