అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. అన్నపురెడ్డిపల్లి జీపీ కార్యాలయంలో సర్పంచ్‌ లకావత్‌ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంంతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని సూచించారు. పంటమార్పిడి పద్ధతి పాటించాలని, పీఆర్‌ –126 రకం వరి పంట సాగు చేయవద్దని సూచించారు. తహసీల్దార్‌ స్వర్ణ, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబానా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement