రైతులకు అండగా ‘సాక్షి’ | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా ‘సాక్షి’

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

జిల్లా వ్యవసాయాధికారితో రేపు ఫోన్‌ ఇన్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రుతుపవనాల రాకతో జిల్లాలో వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాల నిల్వలు, నకిలీ విత్తనాలు, తొలకరి వర్షాలకే విత్తనాలు వేసే పరిస్థితులు, తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావుతో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహించనుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 12–06–2026, శుక్రవారం సమయం : ఉదయం 11నుంచి

12 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు

8977743066, 9347111131

Advertisement
 
Advertisement
Advertisement