13.6 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

13.6 కిలోల గంజాయి స్వాధీనం

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

భద్రాచలంటౌన్‌: సీలేరు, ఒడిశా ప్రాంతాల్లో కొనుగోలు చేసి.. కర్నూలు, నల్లగొండ, హైదరాబాద్‌కు మూడు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న ఎండు గంజాయిని కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్‌ వద్ద ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, 13.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.9.90 లక్షలు ఉంటుందని, ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని ఎస్‌ఐ వివరించారు. తనిఖీల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది రాజు, రమేశ్‌బాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడులు

బూర్గంపాడు: మండలంలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.12,480 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ప్రసాద్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement