భద్రాచలంఅర్బన్: బైక్‌ల చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ అరుణ్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం రాత్రి కూనవరం రోడ్డులో టౌన్ ఎస్‌ఐ శ్యాం వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడిని ఆపి విచారించారు. దీంతో పట్టణంలో 8వ తేదీన ద్విచక్రవాహనాల చోరీ నిందితుల వివరాలు తెలిశాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకులు జల్సాలకు అలవాటు పడి.. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి నగదుకు బదులుగా చోరీ చేసిన ద్విచక్రవాహనాలను ఇచ్చినట్లు తేలిందని డీఎస్పీ చెప్పారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారని, వీరిపై గతంలో హైదరాబాద్, ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయని, వారిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ఛేదించామని డీఎస్పీ అరుణ్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ శ్యాం తదితరులు పాల్గొన్నారు.
24 గంటల్లో ఛేదించిన పోలీసులు


