‘పేట’లో సిగపట్లు! | - | Sakshi
Sakshi News home page

‘పేట’లో సిగపట్లు!

Jan 23 2026 6:51 AM | Updated on Jan 23 2026 6:51 AM

‘పేట’లో సిగపట్లు!

‘పేట’లో సిగపట్లు!

సీట్ల కోసం పాత, కొత్త కాంగ్రెస్‌ నాయకుల లొల్లి ఎమ్మెల్యేకు తొలనొప్పిగా మారిన అశ్వారావుపేట సీట్ల కేటాయింపు?

ఒక్కసారిగా తెరపైకి...

అశ్వారావుపేట: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి నెలకొంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 22 వార్డులకు 18 వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాటుపై చర్చలు జరుపుకున్నారు. ఆ తర్వాత, బుధవారం రాత్రి ఖమ్మంలోని ఓ నాయకుడి ఇంట్లో జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటుపై మళ్లీ తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. పాత కాంగ్రెస్‌ నాయకులకూ సీట్లు కేటాయించాలని కీలక వ్యక్తి ఒకరు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో సీట్లను సర్దుబాటు చేసుకునేలా ఒప్పందం చేసుకుని వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిగే సమయంలో రెండు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తిరిగి మరోమారు చర్చలు జరిగినా వ్యవహారం ఓ కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎమ్మెల్యే కారు ఎదుట వాగ్వాదం

చర్చల అనంతరం ఎమ్మెల్యే దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా కారు ఎదుటే కాంగ్రెస్‌ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గురువారం ఉదయం నుంచి ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయి. గతంలో జూపల్లి వర్గం మాట నెగ్గిందని పాత కాంగ్రెస్‌ నాయకులు భావించిన ఘటనలు ఉండగా, గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జూపల్లి రమేష్‌ వర్గీయులు చెట్ల కింద పడిగాపులు కాశారు. క్యాంపు కార్యాలయం భవంతి పైఅంతస్తులో పాత కాంగ్రెస్‌ నాయకులు బైఠాయించి సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం ఆసక్తి రేకెత్తించింది.

కమ్యునిస్టులకు రెండు సీట్లు?

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కొత్త, పాత వర్గాలకే 22 వార్డులను సర్దుబాటు చేయడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు సీపీఐ, సీపీఎంలకు చెరో సీటు కేటాయిస్తామని ఎమ్మెల్యే గతంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పొత్తు లేకుండా కమ్యునిస్టులు దాదాపు 9 సీట్లలో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వెరసి సీట్లు కేటాయింపు వ్యవహారం ఎటు దారితీస్తుందోననే చర్చ సాగుతోంది.

మున్సిపల్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు

అశ్వారావుపేట మండలంలో 27 పంచాయతీలు ఉండగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుడు జూపల్లి రమేష్‌ వర్గం 16 పంచాయతీలను కై వసం చేసుకుంది. మరో పంచాయతీని ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన వాటిలో ఒకటి ఏవీఎస్పీ ఏకగ్రీవం కాగా, బీఆర్‌ఎస్‌ అనుబంధ అభ్యర్థులు, కాంగ్రెస్‌కు చెందిన కొందరు పెద్దలు, స్థానిక పరిశ్రమల సహకారంతో మరికొందరు గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో స్తబ్దుగా ఉన్న పాత కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నుంచి తెరమీదకు వచ్చారని, కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులను తీసుకొచ్చి సీటు కావాలని ఎమ్మెల్యేను డిమాండ్‌ చేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement