
పోడు విస్తరణను అరికట్టాలి
పాల్వంచరూరల్ : జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కొత్తగా పోడుసాగు విస్తరణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ బి.భీమానాయక్ అధికారులను ఆదేశించారు. డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌తో కలిసి సోమవారం ఆయన పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ కార్యాలయంలో రూ.6లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేసిన మీటింగ్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అటవీ ప్రాంతంలో బీట్ల వారీగా నిరంతరం పర్యవేక్షించాలని, కొత్తగా పోడు సాగు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కొత్తగా పోడు సాగైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని టేకులచెరువు, అంజనాపురం బీట్లలోని ప్లాంటేషన్‌ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బాబు తదితరులు పాల్గొన్నారు.
సీసీఎఫ్ భీమానాయక్