
2 కే రన్‌కు అనూహ్య స్పందన
కొత్తగూడెంటౌన్: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కొత్తగూడెంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్‌కు అనూహ్య స్పందన లభించింది. స్థానిక పోస్టాఫీస్ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో క్రీడలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ధ్యాన్‌చంద్ ప్రతీ క్రీడాకారుడికి ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, కోచ్‌లు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.