ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి

Aug 25 2025 8:36 AM | Updated on Aug 25 2025 8:36 AM

ఉద్యమ

ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి

కొత్తగూడెంఅర్బన్‌: 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతిరామ్‌ అన్నారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్‌, హెల్త్‌కార్డులు, ఆర్టీసీ బస్‌పాస్‌లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. చాలామంది ఉద్యమకారులు అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని, వారికి ఇప్పటికై నా సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో వందనపు సూర్యప్రకాష్‌, గెర్షోము, గఫార్‌, సారయ్య, కనకయ్య, నరేంద్రుల ఉపేందర్‌రావు, నర్సింహారావు, శేషంరాజు, గౌతం, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గోదావరిలో కొట్టుకొచ్చిన గేదె సురక్షితం

రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక పోలీసులు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం నదిలో ఎగువ నుంచి కొట్టుకొస్తున్న ఓ గేదెను ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలిలా.. ఆదివారం గోదావరిలో ఓ గేదె కొట్టుకొస్తుండగా.. గమనించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ అధికారులు వెంటనే లాంచీ ద్వారా వెళ్లి తాళసాయంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం దానికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం లీడింగ్‌ ఫైర్‌ ఫైటర్‌ సాధిక్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యాదికారులు సిబ్బంది పాల్గొన్నారు.

మెడికల్‌ బోర్డు నిర్వహణపై కార్మికుల ఆందోళన

సింగరేణి(కొత్తగూడెం): మెడికల్‌ బోర్డు నిర్వహణపై కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే ఈ బోర్డును రద్దు చేసి మరో బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఏబీకేఎంఎస్‌ జాతీయ నాయకుడు పి.మాదవనాయక్‌ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలోని మిలీనియం డీ కాలనీ కార్మిక వాడల్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత నెలాఖరులో నిర్వహించిన రిఫరల్‌ బోర్డులో 54 మంది హాజరు కాగా అందులో 5గురిని అన్‌ఫిట్‌ చేయడంతో సుమారు 9 నెలల పాటు వారు విధులకు వెళ్లలేదన్నారు. గుండె, కిడ్నీ, పెరాలసిస్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎలాంటి ఆధారాలతో ఫిట్‌ చేశారో యాజమాన్యం స్పష్టత ఇవ్వాలన్నారు. సర్వీస్‌ నిబంధనలు లేకుండా అందరినీ ఫిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఉపాధ్యక్షులు రాంసింగ్‌, జీవీ కృష్ణారెడ్డి, మొగిలిపాక రవి, కె.ప్రకాశ్‌, చంద్రశేఖర్‌, రేణుక, ఇనపనూరి నాగేశ్వరరరావు, శ్రవన్‌కుమార్‌, ధరావత్‌ నాగేశ్వరరావు, రాజేష్‌, వడ్డీకాసులు, గోపీకృష్ణ, సుధాకర్‌, ఎండీ కాలనీ వాసులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

రోటవేటర్‌ కింద పడి బాలుడి దుర్మరణం

కూసుమంచి: మండలంలోని లోక్యాతండా శివారు కొత్తతండాలో రోటవేటర్‌ కిందపడి ఓ బాలుడు దుర్మ రణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వడిత్యారాంబాబు తనట్రాక్టర్‌ రోటవేటర్‌తో దుక్కి దున్నేందుకు వెళ్లాడు. అతడి ఆరేళ్ల కుమారుడు భువనేశ్వర్‌ను ట్రాక్టర్‌పై ఎక్కించుకుని దుక్కిదున్నుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు రోటవేటర్‌ కింద పడి మృతిచెందాడు. కళ్లముందే కన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతున్న

వ్యక్తి మృతి

ఖమ్మంరూరల్‌: మండలంలోని తల్లంపాడు వద్ద గల ఓ వెంచర్‌లో గడ్డిమందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసు మంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన అంబాల భాస్కర్‌ (28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం ఖమ్మంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేశాడు. ఆ ఉద్యోగం మానేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న వెంచర్‌లో గడ్డిమందు తాగాడు. విషయం తెలు సుకున్న బంధువులు ఆయన్ను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివా రం మృతిచెందాడు. మృతుడి తండ్రి బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.

ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి
1
1/1

ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement