
గోపాల కృష్ణుడి లీలలు అంతా ఇంత కాదయా..
● ఫేక్ అటెండెన్స్‌లో అందరికీ సుపరిచితుడు ● తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1గా అరెస్టు, రిమాండ్
టేకులపల్లి: మండలానికి చెందిన ఓ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు ఫేక్ అటెండెన్స్‌లో సుపరిచితుడు. తాజాగా అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కిష్టాపురం గ్రామానికి చెందిన ఒర్సు గోపాలకృష్ణ 2017లో టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రెండేళ్ల క్రితమే కోయగూడెం పంచాయతీకి బదిలీ అయి డిప్యూటేషన్‌పై తిరిగి తడికలపూడికి రావడంతో పాటు దాసుతండా పంచాయతీకి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈనెల 18న మండలంలో మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా తడికలపూడి పంచాయతీలో బీటీ రోడ్డు శంకుస్థాపన రోజు కనిపించిన సదరు కార్యదర్శి మరుసటి రోజు నుంచి విధులకు హాజరు కాలేదు. 20న తన పిల్లలకు డెంగీ జ్వరం వచ్చిందని విధులకు రాలేనని అధికారులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు సమాచారం. 22న తడికలపూడి, దాసుతండాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలకూ రాకపోవడంతో సమీప పంచాయతీ కార్యదర్శులతో ఎంకై ్వరీ చేయాల్సి వచ్చింది.
కార్యదర్శి లీలలు..
●జిల్లా వ్యాప్తంగా 42 మంది కార్యదర్శులు ఫేక్ అటెండెండెన్స్‌లో దొరికితే.. అందులో సదరు కార్యదర్శి గోపాలకృష్ణ ఏకంగా 21 రోజుల పాటు తన నైపుణ్యం ప్రదర్శించాడు.
●మండలంలో మిషన్ భగీరథతో పాటు రోడ్లు, కాల్వల నిర్మాణాలకు కాంట్రాక్టర్‌గా చేసినట్లు చర్చ జరుగుతోంది.
●విధుల పట్ల నిర్లక్ష్యం, అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తాడనే ఆరోపణలు కోకొల్లలు.
నకిలీ మద్యం దందా..
కార్యదర్శిగా, కాంట్రాక్టర్‌గా చేస్తూ వచ్చిన ఆదా యం సరిపోవడం లేదని అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం దందాలో సదరు కార్యదర్శి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం. ఈనెల 21న మహబూబాబాద్‌జిల్లాలో అక్రమ నకిలీ మద్యం తయా రు చేస్తూ అరెస్టయిన కేసులో సదరు కార్యదర్శి ఏ1గా ఉండడంవిశేషం. ఇదిలా ఉండగా నకిలీ మద్యంకేసులో కార్యదర్శి అరెస్టు, రిమాండ్ ఘ టన పై మండల అధికారులు జిల్లా అధికారులకులేఖద్వారా విషయం తెలియజేసినట్లు సమాచారం.

గోపాల కృష్ణుడి లీలలు అంతా ఇంత కాదయా..