
కారు చోరీ కేసులో అరెస్ట్..
మణుగూరుటౌన్: మండలంలోని ఆదర్శ్‌నగర్‌లో ఓ వ్యాపారి కారును పార్క్ చేయగా చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తులను మణుగూరు పోలీసులు ఆదివా రం అరెస్ట్ చేశారు. సీఐ నాగబా బు కథనం ప్రకారం.. ఈ నెల 13న మహ్మద్ ఫిరోజ్ తన కారు ను ఆదర్శ్‌నగర్‌లో పార్క్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ మేరకు స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణుగూరు సుందరయ్యనగర్‌కు చెందిన లారీ మెకానిక్ షేక్ కరంతుల్ల, చెరువు ముందు సింగారానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ నాజీర్‌లను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కారు చోరీ చేసినట్లు తెలిపి రిమాండ్‌కు తరలించారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
గుండాల: మండలంలోని మామకన్ను కాచనపల్లి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆళ్లపల్లి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్సై సోమేశ్వర్ కథనం ప్రకారం.. ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాచనపల్లి అటవీ ప్రాంతం నుంచి పోలారం గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు ఇసుక లోడ్‌తో వెళ్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు.