
వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
270 / 240
జిల్లాలో మంగళవారం ఆకాశంలో మేఘాలు అలుముకుంటాయి. మధ్యాహ్నం జల్లులు కురిసే అవకాశం ఉంది.
● గోదావరిలో వరద ఉధృతి
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతోపాటు ఎగువన ఉన్న కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్‌ల నుంచి వరదనీరు వస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.50 అడుగులకు చేరింది. సాయంత్రం 5 గంటలకు 37.70 అడుగులకు పెరిగింది. నది ఒడ్డున మెట్లప్రాంతంలోని తాత్కాలిక స్నానపు గదులు నీటమునిగాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాలలోని నారచీరల ప్రాంతంలో ఉన్న సీతమ్మవారి విగ్రహం పూర్తిగా నీట మునిగింది. సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారిపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.

వాతావరణ ం