
మరో ప్రమాదంలో ఇద్దరు మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్ర మాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ద్విచక్రవాహనదా రుడు మృతిచెందాడు. బుధవారం తెల్లవారుజా మున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ పల్లపు నరేష్(28) మంగళవారం అర్ధరాత్రి రోజు మాదిరి గానే కిరాయికి వెళ్లాడు. పలు ప్రాంతాల్లో తిరిగాక తెల్లవారుజామున నాయుడుపేట వైపు వెళ్తుండగా కరుణగిరి సమీపంలో మున్నేరు బ్రిడ్జి వద్దకు రాగా నే వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టా డు. ఈ ఘటనలో ఆటో, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే, ఆటోడ్రైవర్ నరేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడుపుతున్న ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన వున్నపు రాంచరణ్ సాయి(22)సైతం మృతిచెందాడు. ద్విచక్రవాహనం వెనకాల కూర్చున్న చల్లా వీరబాబు,రాంబాబుకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ నరేష్ భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐముష్కరాజు తెలిపారు.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి